ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు 'వేవ్స్ సమ్మిట్ 2025'కు ఆహ్వానం

  ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు 'వేవ్స్ సమ్మిట్ 2025'కు ఆహ్వానం అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్రం హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్‌ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌర‌వ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం ఆమె సినిమా రంగంలో ఎదుగుతున్న స్థాయిని చాటుతోంది.   ‘మోటివ్ ఫర్ మర్డర్’ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జో శర్మ ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి. జో శర్మకు WAVES సమ్మిట్ 2025 ఆహ్వానం రావడం ఆమె గ్లోబల్ సినీ ప్రాధాన్యతను సూచించడంతోపాటు, ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వె...
ఇటీవలి పోస్ట్‌లు

కోర్స్‌విటా హైదరాబాద్‌లో 'డిజైనాథన్'ను నిర్వహిస్తోంది: డిజైన్ మరియు సృజనాత్మకత వేడుక

కోర్స్‌విటా హైదరాబాద్‌లో 'డిజైనాథన్'ను నిర్వహిస్తోంది: డిజైన్ మరియు సృజనాత్మకత వేడుక హైదరాబాద్, ఏప్రిల్ 27, 2025: కోర్స్‌విటా ఇటీవల హైదరాబాద్‌లోని డిజైనర్లు మరియు సృష్టికర్తలకు అంకితం చేయబడిన 'డిజైనాథన్' అనే ప్రత్యేకమైన హ్యాకథాన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 27, 2025న జరిగిన 12 గంటల ఈవెంట్‌లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు, UX/UI డిజైన్ ఔత్సాహికులు, సృష్టికర్తలు మరియు ఎడిటర్లు విభిన్న సృజనాత్మక సవాళ్లలో చురుకుగా పాల్గొన్నారు. 'డిజైనాథన్' అనేది కోర్స్‌విటా తన రాబోయే విద్యా ఉత్పత్తులైన పోర్ట్‌ఫోలియో బిల్డర్, జాబ్ సిమ్యులేషన్ మరియు క్విజ్‌విటా కోసం చేపట్టిన ప్రమోషనల్ ప్రచారంలో భాగం. ఈ కార్యక్రమం గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ, కోర్స్‌విటా వ్యవస్థాపకుడు అర్జున్ వినయ్ ఇలా అన్నారు: "హైదరాబాద్‌లో ఈ స్థాయిలో అతిపెద్ద డిజైన్ పోటీని నిర్వహించడం మాకు గర్వకారణం. సంవత్సరాలుగా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రధానంగా ఐటీ రంగానికి దారితీసే కెరీర్ మార్గాలను అనుసరించారు. ఈ కార్యక్రమం చాలా మంది డిజైన్ ఔత్సాహికులను మరియు సృష్టికర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. AI...

కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ నివాళి!

కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ నివాళి! ఇటీవల కశ్మిర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది.  ఈ క్రమంలో MAA మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామం అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ దాడికి ప్రపంచం మొత్తం కూడా బాధకు గురయ్యింది అన్నారు. మన దేశంలో మంచి మంచి పర్యాటక ప్రదేశాలు వున్నా, పక్క దేశాల వారు రావడానికి ఇష్టం చూపించట్లేదు అన్నారు. దానికి కారణం మనలో మనకే తేడాలు అన్...

టిఎస్ఆర్ మూవీ మేకర్స్' ప్రొడక్షన్ నెంబర్ 3: మొదటి షెడ్యూల్ ప్రారంభం

 ' టిఎస్ఆర్ మూవీ మేకర్స్' ప్రొడక్షన్ నెంబర్ 3: మొదటి షెడ్యూల్ ప్రారంభం  టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, మరియు కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ మరియు భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.  విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయట. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, మరియు విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చిత్రికరించబడుతుంది. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి కథనంలో సమతుల్యతను పాటిస్తూ, ప్రేమ...

*ఘనంగా ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ సక్సెస్ మీట్*

*ఘనంగా ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ సక్సెస్ మీట్* ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన  ‘సూర్యాపేట్ జంక్షన్’  మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.  ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, "‘సూర్యాపేట్ జంక్షన్’పై మీరు చూపించిన ప్రేమ, ఆదరణ మా హృదయాలను హత్తుకుంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్ పెరిగినందుకు ఆనందంగా ఉంది. మౌత్ టాక్ కూడా  ప్రేక్షకులను థియేటర్ కు వెళ్లేలా చేస్తుంది. మా చిత్ర యూనిట్ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలకు, సపోర్ట్ కు ధన్యవాదాలు," అన్నారు. హీరోయిన్ నైనా సర్వర్ మాట్లాడుతూ, "ప్రేక్షకులు ‘సూర్యాపేట్ జంక్షన్’ సినిమాను ఇంతగా ఆదరించడంలో మాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. సినిమా సూపర్ హిట్ టాక్ చేసిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు," ...

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

  ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు  హీరో రాజు, తన భార్య సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ఖుషి డాన్స్ స్టూడియో ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూకట్పల్లిలోని వారి డాన్స్ స్టూడియో వద్ద తొలి వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుతుబుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. అలాగే చిత్రం శ్రీను, సోదర చిత్ర నటుడు సంజోష్, అన్వేషి చిత్ర నిర్మాత కిరణ్ కందుల గారు, కొరియోగ్రాఫర్ బాబి, పంచ్ ప్రసాద్ ఇంకా మరికొందరు సినీ సెలబ్రిటీలు, కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ పాల్గొని ఈ వేడుకను మరింత ఘనవిజయం చేశారు. ఈ సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ తో కొన్ని డాన్స్ ప్రోగ్రాములు చేసి తమ ప్రతిభను చాటి చెప్పకుంటూ ఆ వేడుకను మరింత కళాత్మకంగా చేశారు.  ఈ సందర్భంగా సోదర చిత్ర నటుడు సంజోష్ మాట్లాడుతూ... "డాన్స్ చేయడం అనేది ఎంత కష్టమైన విషయమో నటుడుగా నాకు తెలుసు. పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు మరింత బాగా చేసి ఉన్నత స్థాయికి వెళ్లాలి. అలాగే ఖు...

పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ *

 * పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ * పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధానిమంత్రి మోదీకి, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు తమ పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఎన్ సీసీ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కే సదా శివారెడ్డి, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వీ వీ జి కృష్ణం రాజు (వేణు ),  కోగంటి భవానీ,   తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా *ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ* - పహాల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉగ్రవాద...