* సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ* సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి తనతో జంటగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జుడా సంధ్య చిత్రానికి సంగీతం అందించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ... "మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉ...
సినీ, టీవీ నటుడు ఎ. గోపాలరావు మృతి ప్రముఖ సినీ టీవీ నటులు అల్లం గోపాలరావు ఈరోజు ఉదయం 8 గంటలకు అనారోగ్య కారణంగా తన నివాసంలో మృతి చెందారు ఆయన వయసు 75 సంవత్సరాలు ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్దబాయ్ అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. గోపాలరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.