ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు, తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

  స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు,  తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.  తీవ్రభయాందోళనకు గురయిన పరిసర ప్రాంతాల ప్రజలు  ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని ఓ మెడివేస్ట్ స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.మంటలు ఆర్పి స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది. గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.    స్క్రాప్ దుకాణం ఎస్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాబుద్దీన్ గత కొన్నేళ్లుగా గగన్ పహడులో స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున...

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. సమీక్ష  అమరావతి. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం.వి. శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్‌ దీవాన్‌ రెడ్డి, నాడు–నేడు డైరెక్టర్‌(టెక్నికల్‌) మనోహరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

"ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

"ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"   తన పోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని వైసీపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు  సొంత పార్టీ నేతలె ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇందుకు సంబందించిన ఆధారాలు చాల వున్నాయని తెలిపారు గతంలో కూడ గన్ మెన్ ల మార్పు పై కూడ ఆనం హట్ కామెంట్స్ చేశారు....

జల్లికట్టులో అపశృతి

చిత్తూరు జిల్లా,చంద్రగిరి మండలం  జల్లికట్టు లో విషాదం అదుపుతప్పి జనం పైకి దూసుకెళ్లిన కోడి గిత్తలు ఇద్దరికి తీవ్రగాయాలు ఒకరి పరిస్థితి విషమం. గాయపడిన వారు చంద్రగిరి మండలం కాశి పెంట్ల కు చెందిన యువకులు గా గుర్తింపు.

శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత

సూర్యగ్రహణం కారణంగా ఈరోజూరాత్రి 11 గంటల నుంచిరేపుమధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమలశ్రీవారిఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టిటిడిఅధికారులుతెలిపారు.ఈసందర్భంగాశ్రీవారిఆలయప్రధానఅర్చకులువేణుగోపాలదీక్షితులు తెలిపారు రేపుఉదయం8.08 గంటలకుసూర్యగ్రహణం ప్రారంభమై ఉదయం11.16 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని, రేపుమధ్యాహ్నం 12గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు నిర్వహిoచినఅనంతరం2 గంటలనుంచి భక్తులకు సర్వదర్శనంకు అనుమతిస్తామన్నారు..సూర్యగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులతోసహాఅందరికిరద్దు చేస్తామన్నారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలతోపాటుశ్రీవారిఆలయంలోనిర్వహించేఅన్నిరకాలఆర్జితసేవలనురద్దుచేశామన్నారు...

అమరావతి పై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన కామేంట్స్ 

అమరావతి పై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన కామేంట్స్  ఏపీ రాజధాని అమరావతి పై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన కామేంట్స్  చేశారు. రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్‌ ఎడారిలోకి వెళ్తున్నట్టుగా ఉందని కీలక  వ్యాఖ్యలు చేశారు తన సహచరులతో కలిసి వెళుతుంటే రాజదాని ఎంతకు కనపడలేదని రాజదాని ఎక్కడ అని పక్కవారిని అడిగానని వారు చెప్పడాని కాస్త ఇబ్బంది పడ్డారని  నిజాలను ఎవరు దాచలేరని  తెలిపారు స్పీకర్ అన్నారు  రాజధాని నాది అని ప్రజలు భావించాలి. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదని రాష్ల్ర అభివృద్ది మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలంతా  స్వాగతిస్తున్నారని అన్నారు .విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. 

అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యం మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి

అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యం మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి  అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యంఅని తెలిపారుమాజీ కేంద్రమంత్రిచిరంజీవి రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది.. అమరావతి - శాసన నిర్వాహక , విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూల్ - న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలి..  ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి..  గత అభివృద్ధి , పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది..  ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి.. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందిసాగు,తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది..ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్...

సింపుల్ గా జన్మదిన వేడుకలు

జన్మదినం సందర్బంగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో  కేక్ కట్ చేయించిన అధికారులు ,మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అధికారులు,మంత్రులు

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం మంత్రి బొత్స 

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం మంత్రి బొత్స  అసెంబ్లీ శీతాకాల సమావేశాలను టీడీపీ సజావుగా జరగనివ్వడం లేదని మండిపడ్డారుమంత్రి బొత్స సత్యనారాయణ .తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని  పేర్కన్నారు ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ స్పూర్తితో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామన్నారు .రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు  .అమరావతిలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నావాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కోన్నారు రాష్ట్రంలో మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడానికే దిశ యాక్ట్ తీసుకువచ్చాం అన్నారు

తిరుపతి లో మరో దారుణం  16 ఏళ్ళ మైనర్ బాలిక  రేప్ 

తిరుపతి లో మరో దారుణం  16 ఏళ్ళ మైనర్ బాలికను  రేప్  లిఫ్ట్ ఇస్తామని చెప్పి ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్  . ఎన్ని చట్టాలు వచ్చిని మహిళల పై అత్యచారాల పరం పర కొనసాగుతునే వుంది      దిశ ఘటన ఇంకా మరువక ముందే తిరుపతి లో మరో దారుణం చోటు చేసేకుంది .లిఫ్ట్ ఇస్తామని చెప్పి16 ఏళ్ళ మైనర్ బాలికను  రేప్ చేశారు  ఇద్దరు యువకులు  వివారల్లోకి వెళితె ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలిక నడుచుకుంటూ వెళుతున్న సమయంలొ బాలిక కు  లిప్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి .  వెంకటేశ్,రాజమోహన్ నాయక్ అనే ఇద్దరు యువకులు ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఇద్దరు యువకులను  తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు..ఇందులో ఒకరు రౌడి షీటర్ పలు కేసుల్లొ ముద్దాయి అని సమాచారం .

ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు మంత్రి  పేర్నినాని

ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు మంత్రి  పేర్నినాని పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై..  కిలో మీటర్‌కు 10 పైసలు పెంపు మిగిలిన అన్ని సర్వీసులకు 20 పైసలు పెంపు డీజిల్‌ ధరలు పెంచినందుకే ఆర్టీసీ ఛార్జీలు పెంచాం ఆర్టీసీని బ్రతికేందుకే ప్రభుత్వం లక్ష్యం  ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం వస్తోంది- పేర్నినాని విజయవాడ ..ఆర్టీసీని బ్రతికేందుకే ప్రభుత్వం లక్ష్యం అందుకే ఆర్టీసీ  చార్జీలు పెంచామని మంత్రి  పేర్నినాని తెలిపారు  ఏటా  రూ.1200 కోట్ల నష్టం వస్తోందని ఒక వైపు డీజిల్‌ ధరలు పెంపు.2015 లో డీజిల్ ధర 50 ఉంటే నేడు 75 కు చేరిందని మరో వైవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అంస్థ  కి  పేరుకుపోయిన నష్టాలు 6735 కోట్ల రూపాయలు కు చేరుకుంది,2995వకోట్లు వివిధ వ అప్పులు 3740 కోట్లు.. బకాయిలు. .ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి ,  భారంగా మారాయి..ప్రతినెలా 100 కోట్లు అప్పు పెరుగుతుంది..ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయన్నారు మంత్రి పేర్నినాని అయితే పెరిగిన చార్జీలు ఏప్పటి నుండి అమలు లోకి రానున్నాయో  త్వ రలో చెబుతామన్నారు  

చిత్తూరు జిల్లా బైరవ కోన లో క్షుద్ర పూజల కలకలం

చిత్తూరు జిల్లా బైరవ కోన లో క్షుద్ర పూజల కలకలం చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి అనుమతి లేని పూజలు నిర్వహించారు.ఆలయ అధికారుల అనుమతి లేకుండా చెన్నైకు చెందిన ఐదుగురు వ్యక్తులు అమావాస్య కావడంతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పూజలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పూజలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించాడన నెపంతో ఏఈఓ ధనపాల్ ను     రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది

టిడిపినేతలు ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్ని నకిలీవే  యార్లగడ్డ వెంకట్రావు

టిడిపి నేతలు ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్ని నకిలీవే  యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాసల్సిన అవసరం లేదని చెప్పారు వైయస్‌ఆర్‌ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు..సీయం  జగన్ ను కలిసినపుడు వంశీ విషయం చర్చకు రాలేదన్నారు  వైయస్‌ జగన్‌పై ఉన్న విశ్వాసంతో అమెరికా నుంచి  వచ్చానని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని పార్టీ వీడే  ప్రసక్తే లేదని   స్పష్టం చేశారు ముఖ్యమంత్రి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు ఎన్నికల సమయం లో గన్నవరం లో టిడిపి నేతలు ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్ని నకిలీవని ఆరోపించారు 

టిడిపి  సీనియర్ నేత బాబు రాజేంద్ర ప్రసాద్  అలక

విజయవాడ ...   టిడిపి  సీనియర్ నేత బాబు రాజేంద్ర ప్రసాద్  పార్టీ  పై  అలక బూనారు   తన పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తు వ్యక్తితగంగా దూషించిన పార్టీ   పట్టించుకోలేదని మన స్థాపం చెందారు తాపి గా సాయంత్రం స్పందించటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు అయితె పార్టీ న్యాయ సహయం  చేస్తె  వంశీ పై  పోరాటానికి దిగుతానని అనుచరులతో వ్యాఖ్యనించినట్లు తెలిసింది ఇప్పటికే  పార్టీ అగ్ర  నేతలు రాజేద్ర ప్రసాద్ తో చర్చించినట్లు సమాచారం                                      

కావాలనే  నా పై తప్పుడు ప్రచారం  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

.సోషల్‌ మీడియాలో సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుకు   ఫిర్యాదు చేశారు. ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన రాజకీయ భవిష్యత్‌ నాశనం చేయాలని కొందరు వ్యక్తులు పనికట్టుకొని పోస్టులు పెడుతున్నారని .   అటువంటివారిపై చర్యలు తీసుకోవాలని    సీపీని కోరామని  వంశీ తెలిపారు.

టిడిపి నేత నారా  లోకేష్ పై  గన్నవరం ఎమ్మెల్యే వంశీ  ఫైర్

మాజి మంత్రి నారా లోకేష్ పై వల్లభనుని వంశీ విరుచుకు పడ్డారు. నోరు అదుపు లో పెట్టుకోవాలంటు హెచ్చరించారు గన్నవరం ఎమ్మెల్యే వంశీ..    లోకేశ్‌తో తనకు పోలికేంటని . తాను సొంతంగా గెలిచానని.. లోకేశ్  మంగళగిరి  లో ఓడిపోయారని ఎద్దేవా చేశారు      జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. తనకు రాజకీయ జీవితం ఉండదనే భ్రమలో లోకేశ్ బతుకుతున్నారంటూ విమర్శలు గుప్పించారు ఎన్నికలలో ఓటమి తర్వాత అభద్రతా భావంలో ఉన్నారని  తెలిపారు పార్టీ కి రాజీనామ చేశాక చంద్రబాబు తనను సస్పెండ్ చేయడం ఏమిటని  దమ్ముంటే రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి చూపించాలన్నారు .తనను విమర్శిస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసని దుమారం లేపే  వ్యాఖ్యలు చేశారు

వ్యక్తిగత దూషణలు వద్దు  లేదంటే  మేము అదె స్థాయి లో స్పందిస్తాం పవన్ కల్యాణ్

అమరావతి .ఇసుక సమస్య పై  గవర్నర్  విశ్వ భూషణ్ హరిచందన్  ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గవర్నర్ కు లేఖ అందించారు  గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు   అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు  రాష్ర్టం లో ఇసుక కొరత నెలకొందని దాదాపు 50 మంది చనిపోయారని  ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్  జయంతి వేడుకల్లో సీయం జగన్  చేసి నా వ్వాఖ్వల పై పవన్ మండి పడ్డారు   జనసేన అంటే వైసిపి.భయం పట్టుకుందని అందుకే ప్రతి సారి  నేను మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాని వ్యక్తిగత గత ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు .ప్రభుత్వం అవగాహన లేకుండా పాలిస్తుందని మండి పడ్డారు  విది విదానాల పై మాట్టడాలి కాని ,,వ్యక్తిగత విషయాల పై మాట్లడవద్దని లేదంటే  మేము అదె స్థాయి లో స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు