*యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా సమర్పణలో తెరకెక్కిన సునామీ కిట్టి ‘కోర’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్* ఇండియన్ స్క్రీన్ మీద ప్రస్తుతం యాక్షన్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి, సాధిస్తున్న విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి యాక్షన్ హీరోలు కన్నడ నుంచి ఎక్కువగా వస్తున్నారు. కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సమర్పణలో సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలతో ‘కోర’ అనే చిత్రాన్ని ఒరటాశ్రీ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా కోర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. హై ఆక్టేన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం రాబోతోందనిపిస్తోంది. సునామీ కిట్టిని ఆగ్రహావేశాలు ఈ లుక్‌లో కనిపిస్తున్నాయి. అతని ముఖం మీద గాయాలు, ఇంటెన్స్ లుక్‌ని చూస్తుంటే ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కోరా చిత్రం ఉండబో...
కేరళలో 1000 కోట్లు* మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000 కోట్లు. గతంలో "100 కోట్లు"వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం "1000 కోట్లు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* కేరళలో 1000 కోట్లు* మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000 కోట్లు. గతంలో "100 కోట్లు"వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం "1000 కోట్లు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ" మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు. మోహన్ లాల్, కావ్య మాధవన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాతీష్ వేగ, డిఓపి: ప్రదీప్ నాయర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాసింశెట్టి వీరబాబు, నిర్మాతలు: క...